Home Page SliderNational

50 లక్షల జరిమానాతో ట్విటర్‌కు హైకోర్టు ఝలక్

కర్ణాటక హైకోర్టు ట్విటర్‌కు 50 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్రప్రభుత్వ ఆదేశాలపై ట్విటర్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో కేంద్రప్రభుత్వం సామాజిక మాథ్యమాల్లో అభ్యంతర కామెంట్లను నిరోధించాలంటూ ట్విటర్‌ను ఆదేశించింది. దీనిని వ్యతిరేఖిస్తూ ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టిపడేసింది. ట్విటర్ అకౌంట్లు, ట్వీట్లు బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందనే కేంద్రప్రభుత్వ వాదనతో కోర్టు అంగీకరించింది. ట్విటర్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా, ఈ సంస్థకు 50 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. దీనిని 45 రోజులలో కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని, ఆలస్యమైతే రోజుకు 5 వేల రూపాయల చొప్పున ఫైన్ కూడా కట్టాలని జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.