హైదరాబాద్‌లో హవాలా డబ్బు సీజ్.. ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌లో భారీగా హవాలా డబ్బును కాచిగూడ పోలీసులు పట్టుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్‌లో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు.. హరి నారాయణ కొట్టారి అనే వ్యక్తి వద్ద 17 లక్షల హవాలా డబ్బును గుర్తించారు. హరి నారాయణ కొట్టారి బడి చౌడి ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు నగదును సీజ్ చేసి ఐటీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 17 లక్షల అక్రమ నగదు.. కాటేదాన్ ప్రాంతానికి చెందిన షోహెల్ అనే వ్యక్తి మధ్య చేతులు మారుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చాయి.. ఎవరికీ చెందినవి… అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

