మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయించారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి 29 వరకు గ్రామ ,వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏపీలో కొత్తగా ఏర్పడిన జిల్లాల పేరుతో ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ తీసుకుని దాదాపు 10 సంత్సరాలు దాటినా ఒక్కసారి కూడా తమ చిరునామా,ఫోటో ధృవీకరణ,ఫోన్ నంబర్ తదితర వివరాలను అప్‌డేట్ చేసుకోనివారు రాష్ట్రంలో1.56 కోట్ల మంది ఉన్నారని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా ఏపీలోని ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

