ఈ బాయ్ బిర్యానీ ఏటీయం చూసారా?
‘కాదేదీ కవిత కనర్హం’ అన్నట్లు కాదేదీ స్టార్టప్‌కు అనర్హం అన్నట్లు రకరకాల ఆలోచనలతో వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నారు యువతరం. చెన్నైలోని కొలత్తూర్‌లో దేశంలోనే మొట్టమొదటి సారిగా బిర్యానీ ఏటీయంను ఏర్పాటు చేశారు బాయ్ వీటు కళ్యాణం అనే స్టార్టప్ కంపెనీ. చాలా త్వరగా మనం ఏటీయం మిషన్ నుండి డబ్బు విత్‌డ్రా చేసుకున్నంత ఈజీగా బిర్యానీని కొనుక్కోవచ్చు. ఆర్డర్ చేసి ఎదురుచూసే అవసరం లేకుండా క్షణాల్లో ప్యాక్ చేయబడిన బిర్యానీ కళ్ల ముందుకు వస్తుంది. ఈ బిర్యానీ అవుట్‌లెట్‌లో ఏటీయం మెషిన్ వద్దకు వెళ్లి, కావల్సిన బిర్యానీ ఆర్డర్ చేసి, క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తే చాలు. ఒక్క క్షణంలో మెషిన్ క్రింది భాగం నుండి మన బిర్యానీ ప్యాకెట్ రెడీగా వస్తుంది. ఈ ఐడియాకు కస్టమర్లు చాలా ఖుషీ అవుతున్నారు.

