Andhra PradeshHome Page Slider

యాత్ర-2 మోషన్ పోస్టర్ చూశారా?

ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 74వ జయంతి. ఈ సందర్భంగా యాత్ర-2 సినిమా మోషన్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగ విడుదల చేశారు. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ జీవితంలో 2009-2019 మధ్య జరిగిన ఘటనల ఆధారంగా మహి.పి.రాఘవన్ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే వచ్చే నెల 3 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో జగన్ పాత్రలో హీరో జీవా నటించనున్నారు. వచ్చే ఏడాది ఫ్రిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స ప్రకటించారు.ఈ మోషన్ పోస్టర్‌లో “నేను ఎవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి..నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని ..నేను విన్నాను..నేను ఉన్నాను” అనే డైలాగ్ హైలెట్‌గా నిలించింది. గతంలో మహి.పి.రమేష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమాని రూపొందించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదలైన ఈ యాత్ర సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘటనల ద్వారా తెరకెక్కబోతున్న యాత్ర-2 సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.