Andhra PradeshHome Page Slider

యాత్ర-2 ఫస్ట్ లుక్ చూశారా?

ఏపీ సీఎం జగన్ రాజకీయ ప్రయాణంపై రూపొందిస్తున్న యాత్ర-2 ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. కాగా డైరెక్టర్ మహి వి రాఘవ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నేను ఎవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు.కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని పోస్టర్‌పై క్యాప్షన్ ఇచ్చారు. అయితే యాత్ర-2 సినిమా వచ్చే ఏడాది ఫిభ్రవరి 8న రిలీజ్ చేస్తామని డైరెక్టర్ మహి వి రాఘవ్ ఇప్పటికే ప్రకటించారు. కాగా ఈ సినిమాలో తమిళ నటుడు జీవా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గతంలో వచ్చిన యాత్ర-1 సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కగా ఈ సినిమాలో మళియాళ నటుడు మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మరి ఇప్పుడు సీఎం జగన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న  ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.