రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” మూవీ ఫస్ట్ లుక్ చూశారా?
మాస్ మహరాజ రవితేజ ఈ మధ్యకాలంలో వరుస హిట్‌లతో దూసుకుపోతున్నారు. దీంతో ఆయన మంచి జోష్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రవితేజ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “టైగర్ నాగేశ్వరరావు” అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జిపై ప్రత్యేక రైలు ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవితేజ హీరోగా వంశీ దర్శక్తత్వంలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియాలో విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కాగా ఈ ఫస్ట్ లుక్ టైగర్ నాగేశ్వరరావు సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.