Home Page SliderInternational

కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లను చూశారా?

దేశవ్యాప్తంగా మొన్నటి వరకు సాగిన IPL మేనియా ఎట్టకేలకు ముగిసింది. కాగా ఈ సీజన్‌తో CSK టీమ్ 5 వ సారి IPL ట్రోఫీని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ ప్రియుల కోసం మరో ఫైనల్ మ్యాచ్ సిద్ధంగా ఉంది. కాగా ఈ నెల 7 నుంచి భారత్,ఆస్ట్రేలియాల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌ లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవెల్ స్టేడింలో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా,ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇప్పటికే లండన్‌కు చేరుకున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం రెండు జట్టులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్స్ కొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్నారు. తాజాగా టీమిండియా ప్లేయర్స్‌కు ప్రపంచంలోని పాపులర్ బ్రాండ్ అయిన ఆదిదాస్ సంస్థ జెర్సీలను స్పాన్సర్ చేసింది. ఈ జెర్సీల్లోనే టీమిండియా ప్లేయర్స్ WTC ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు. కాగా ఈ జెర్సీలను ధరించి టీమిండియా ప్లేయర్స్ ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.