Home Page SliderNational

మోదీ యోగా వీడియో చూశారా?

నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యా సమితి కార్యాలయంలో యోగా కార్యాక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం  ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగింది. కాగా మోదీ దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే  ఈ వీడియోలో ఈ మరపురాని వేడుకను ఎప్పటికీ మర్చిపోలేనని మోదీ తెలిపారు. కాగా దాదాపు 180 దేశాలకు చెందిన ప్రముఖులు ఈ యోగాలో పాల్గొన్నారు.  దీంతో ఈ యోగా కార్యక్రమం అత్యధిక దేశాలకు చెందిన ప్రతినిధులు భాగస్వామ్యం కావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.  అంతేకాకుండా మోదీ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.