మంగ్లీ సిస్టర్స్ ‘బృందావనం’ చూశారా?
సింగర్ సత్యవతి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ మంగ్లీ అంటే అందరికీ తెలుసు. ఒక టీవీ షోతో ఈ జానపద గాయకురాలు మంగ్లీగా తెలుగువారికి పరిచయమై అనేక చిత్రాలలో ఫోక్ సాంగ్స్ పాడి అలరించింది. ఎన్నో ఆల్బమ్ సాంగ్స్‌తో కూడా ప్రయోగాలు చేసి, తెలంగాణ పల్లెల అందాల్ని ప్రేక్షకులకు అందించింది. ఇక ఆమె చెల్లెలు ఇంద్రావతి ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావా’ పాటతో సూపర్ హిట్ గాయనిగా పేరు తెచ్చుకుంది. వీరిద్దరూ కలిసి యూపీలోని ‘వృందావన్ చంద్రోదయ మందిరం’లో పాట పాడి, డ్యాన్స్ కూడా చేసిన వీడియోను తాజాగా విడుదల చేశారు. ప్రపంచంలోనే అతి పొడుగైన దేవాలయంగా నిర్మాణంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ప్రమోషన్లలో భాగంగా ఈ పాటను పాడినట్లు ఆమె వివరించారు. వీరిద్దరూ గోపికల వేషంలో కలర్‌ఫుల్ డ్రెస్‌లలో కనిపించారు.

