Home Page SliderTelangana

మల్లా రెడ్డి హోలీ స్టెప్పులు చూశారా..?

తన మాస్ స్టెప్పులతో డాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు మాజీ మంత్రి మల్లా రెడ్డి. హైదరాబాద్ బోయిన్ పల్లిలోని తన నివాసంలో మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హోలీ సంబరాలు జరుపుకున్నారు. డప్పు కొడుతూ, చిన్నపిల్లలను ఉత్సాహ పరుస్తూ, డాన్సులు వేస్తూ తన సతీమణికి రంగులు పూసి హోలీ వేడుకల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మల్లారెడ్డి కోరారు.