ప్రజాభవన్ లోపల ఇంద్రభవనాన్ని తలపిస్తోంది చూశారా?
తెలంగాణ: ప్రజాభవన్ లోపలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదివరకు ఈ భవనం మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం తెలుసుకదా. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. దీంతో బిల్డింగ్ లోపలి వీడియో బయటకు వచ్చింది. విశాలమైన హాల్, డైనింగ్ ఏరియా, ఖరీదైన సోఫాలు, మిరుమిట్లు గొలిపే లైటింగ్‌తో ఇంద్రభవనాన్ని తలపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.