Home Page SliderNational

సీఎం నితీష్ కుమార్ వెలికి చేష్టలు చూశారా..?

బీహార్‌లో తొలిసారిగా జరుగుతున్న సెపక్ తక్రా ప్రపంచకప్ 2025 ప్రారంభోత్సవంలో సీఎం నితీష్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ గీతం ఆలపించే సమయంలో నితీష్ కుమార్ తన ప్రిన్సిపల్ సెక్రటరీ దీపక్ కుమార్ తో నవ్వుతూ మాట్లాడుతూ వివాదానికి దారి తీసింది. దీంతో ఆగకుండా శుభాకాంక్షలు చెపుతూ వెలికి చేష్టలు చేశారు. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ నాయకులు ఆయన ప్రవర్తనను అవమానకరమైనదిగా, అగౌరవకరమైనదిగా అంటూ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం ను ఆపడానికి ప్రయత్నించి, ముందుకు చూడమని కోరినప్పుడు, ముఖ్యమంత్రి నవ్వడం ప్రారంభించి తన ప్రిన్సిపల్ సెక్రటరీ భుజంపై చేయి వేస్తూ నవ్వుతూ సీఎం కనిపించారు. దీంతో సీఎంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.