Andhra PradeshHome Page Slider

తాడేపల్లి ప్యాలెస్‌లో సిద్ధం చేసిన పిటిషన్‌ను మీరు చదివారా ఉండవల్లి?: పట్టాభి

రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన ఉండవల్లి అరుణ్‌కుమార్.. తాను దాఖలు చేసిన పిటిషన్‌లో ఏముందో చదివారా? అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రశ్నించారు. తాడేపల్లి నుంచి కొన్ని కాగితాలు వస్తే పిటిషన్‌కు ఏ డాక్యుమెంట్లు జత చేశారో కూడా చూడకుండా సంతకం పెట్టేస్తారా అని నిలదీశారు. నిజాలన్నీ పిటిషన్‌లోనే ఉన్నా.. తమపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్‌లో సిద్ధం చేసిన పిటిషన్ ఇది. అక్కడి నుంచి కొన్ని కాగితాలు వస్తే దానిపై ఉండవల్లి సంతకాలు చేసేశారు. ఈ పిటిషన్ ఆధారంగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు అసలు లేనే లేవంటారు. కనీసం చదవకుండా పిటిషన్లు వేసేస్తారా? థర్డ్ పార్టీ ఆడిట్ చేసి అన్ని పరిశీలిస్తే చాలా పరికరాలు మిస్ అయినట్లు కనుగొన్నారట? ఫొరెన్సిక్ నివేదికలో ఏముందో కూడా కనీసం చదవాలి కదా? నిజంగా చదివి ఉంటే వస్తువులు పోయాయని చెప్పేవారు కాదు. శరత్ అసోసియేట్ వాళ్లు స్పష్టంగా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు వెళ్లి పరిశీలించలేదని నివేదికలో రాసి ఉంది. ఇవేమీ చదవకుండా హైకోర్టులో పిటిషన్ వేస్తారా అని ఉండవల్లిని పట్టాభి ప్రశ్నించారు.