Home Page SliderInternational

వాట్సప్‌లో సరికొత్త AI  ఫీచర్ గమనించారా..!

ఈ కాలంలో మనం ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ముందుగా ఉపయోగించేది “గూగుల్”.దీంతో గూగుల్ ప్రపంచంలోనే అతి పెద్ద సెర్చ్ ఇంజిన్‌గా అవతరించింది. అయితే ఇటీవల కాలంలో AI అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ AI గూగుల్ కంటే ఎంతో వేగంగా సమాచారాన్ని మనకు అందిస్తోంది. గూగుల్‌లో మనం దేని గురించైనా వెతికేటప్పుడు అది మనకు కొన్ని వెబ్ పేజస్ ద్వారా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్‌ను అందిస్తోంది. కానీ AI అలా కాకుండా మనకు కావాల్సిన దాని గురించి డైరెక్ట్‌గా మనకు సమాచారం అందిస్తోంది. అయితే ఈ సూపర్ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో మనం ఇప్పుడు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్‌కి వెళ్లకుండా  వాట్స్‌ప్‌లో ఉన్న  AI చాట్‌బాట్‌లో సెర్చ్ చేయొచ్చు.అయితే  మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా దీంట్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఇది chat GPT లా మనకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తోంది. అంతేకాకుండా ఈ ఫీచర్‌తో మనం AI ఇమేజ్‌లు క్రియేట్ చేయమని కూడా ఈ చాట్‌బాట్‌లో ప్రాప్ట్ ఇవ్వొచ్చు. మనం ఇచ్చిన దాని ప్రకారం ఈ చాట్‌బాట్ మనకు AI ఇమేజ్‌లను కూడా క్రియేట్ చేస్తుంది.