ఎస్ ఐ విజయలక్ష్మికి హాట్సాఫ్
భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ ప్రధాన రహదారిలో భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి స్పందించి.. తన సొంత ఖర్చులతో సిమెంట్, కంకర, ఇసుక తెప్పించి గుంతలను పూడ్చి వేయించారు. దీంతో ఎస్ఐపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.