Home Page SliderNational

“హథ్రస్ బాధితులకు వీలైనంత ఎక్కువ పరిహారం అందించాలి”:రాహుల్

ఇటీవల యూపీలోని హథ్రస్‌లో జరిగిన భోలే బాబా సత్సాంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ నిన్న బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..హథ్రస్ ఘటనపై రాజకీయ కోణంలో మాట్లాడాలనుకోవడం లేదన్నారు. కానీ పరిపాలనలో లోపాలున్నాయని రాహుల్ తప్పుబట్టారు. కాగా తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో పోలీస్ భద్రత లేదని బాధితులు తనతో చెప్పారన్నారు.కాబట్టి యూపీ ప్రభుత్వం వీలైనంత త్వరగా బాధిత కుటుంబాలకు ఎక్కువ పరిహారం అందించాలని రాహుల్ డిమాండ్ చేశారు. అయితే పరిహారం ఇవ్వడంలో ఆలస్యం చెయ్యొద్దని యూపీ సీఎంను కోరుతున్నాను అని రాహుల్ వెల్లడించారు.