Home Page SliderInternationalSports

టీమిండియా హ్యాట్రిక్ విజయం

మలేషియాలో జరుగుతున్న అండర్-19 మహిళల టీ 20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా మూడవ విజయాన్ని సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నేడు జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి కేవలం 58 పరుగులే చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 49 పరుగులు చేసి, హాఫ్ సెంచరీ మిస్సయ్యింది.