Home Page SliderInternational

భారత్‌కు హ్యాట్రిక్ ..పారాలింపిక్స్‌లో మరో పతకం

పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే రెండు పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్‌కు ప్రీతి పాల్ మరో కాంస్య పతకం సాధించిపెట్టారు. మహిళల పరుగుపందెంలో 100 మీటర్లు, టీ 35 విభాగంలో ప్రీతి పాల్ ఫైనల్‌లో కాంస్య పతకం గెలిచింది. దీనితో భారత్‌కు మూడు పతకాలు చేరాయి. అవనీ లేఖరా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారు పతకం, మోనా ఆగర్వాల్ ఇదే ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించారు.