కాంగ్రెస్ విలన్ అయిందా?: సీఎం రేవంత్
బిఆర్ఎస్ రజతోత్సవ సభకు తాము సంపూర్ణంగా సహకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర 892 జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై సీఎం దీటుగా స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. ‘‘గత ప్రభుత్వ పథకాలు నిలిపివేసినట్లు కేసీఆర్ చెబుతున్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రజాపాలన ఆగిందా?’’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అని మండిపడ్డారు.