హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ రాజీనామా
న్యూఢిల్లీ: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మంగళవారం ఉదయం గవర్నర్ బండారు దత్తారేయను కలిసిన తర్వాత రాజీనామా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో సీట్ల పంపకాల ఒప్పందాలపై పాలక కూటమిలో చీలిక వస్తుందనే ఊహాగానాల మధ్య ఖట్టర్‌తోపాటుగా మొత్తం క్యాబినెట్ రాజీనామా చేసింది. ఖట్టర్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కర్నాల్ నుండి పోటీ చేయవచ్చని కూడా తెలుస్తోంది. 90 స్థానాలున్న అసెంబ్లీలో 40 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల అనంతరం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇప్పటి వరకు బీజేపీ అధికారంలో ఉంది. నిన్ననే ప్రధాని మోదీతో కలిసి ఖట్టర్ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

