హరీశ్‌రావు క్షమాపణలు చెప్పాలి:మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయి. కాగా అసెంబ్లీలో అధికార-ప్రతిపక్ష నేతలు నువ్వా-నేనా అన్నట్లుగా వాదిస్తున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఫైర్ అయ్యారు.బీఆర్ఎస్ నేతలు సభలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. కాగా బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి 24 గంటల కరెంట్ ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు.హరీశ్‌రావు మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కేసీఆర్ సభకు రాలేక హరీశ్‌రావును పంపించారన్నారు.కాగా హరీశ్‌రావు క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.