Breaking Newshome page sliderHome Page SliderTelangana

హరీశ్ రావు అబద్దాలు చెప్పడం లో దిట్ట

ఇరిగేషన్ రంగంలో తానే మాస్టర్ అని హరీశ్ రావు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ఆయన దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మీడియాతో సోమవారం జరిగిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ, కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 90 టీఎంసీలు డిమాండ్ చేస్తే, కేవలం 45 టీఎంసీలే అడిగినట్లు బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పాత జీవో కాపీలను బయటపెట్టిన మంత్రి, తెలంగాణకు అన్యాయం జరిగేలా తాను ఎందుకు లేఖ రాస్తానని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీకి రాసిన లేఖలోని ఒక భాగాన్ని మాత్రమే చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. కృష్ణా బేసిన్‌పై అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఇక మేడిగడ్డ వ్యవహారంపై స్పందిస్తూ, మరమ్మతుల కోసం ఎల్ అండ్ టీ సంస్థకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, తనిఖీలకు ఆ సంస్థ అంగీకరించిందని.. త్వరలోనే మేడిగడ్డ పనులు ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు.