మహా కుంభమేళాలో హరీష్ రావు
తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు యూపీలోని ప్రయోగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా కు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్నారు. మహా గంగా స్నానం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. అయితే.. ఈ కుంభమేళా 45 రోజులపాటు జరుగుతుంది. దీని కోసం మన దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది భక్తులు వస్తున్నారు. అయితే.. మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు.

