‘హరీష్ రావుకు అడిగే హక్కు లేదు’..కోమటిరెడ్డి ఫైర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నేడు సభలో కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో నీటి సమస్యపై కోమటి రెడ్డి మాట్లాడుతుండగా హరీష్ రావు స్పందించారు. దానితో కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “అసలు ప్రతిపక్షనేత కేసీఆర్ ఎక్కడున్నారు?. ఆయన అసెంబ్లీకి రాకుండా ఓటు వేసిన తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారు. అసలు హరీశ్ రావు ఎవరు ఏ హోదాలో మాట్లాడుతున్నారు.? డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా? ఆయనకు అడిగే హక్కు లేదు.” అంటూ మండిపడ్డారు. “నల్గొండ గురించి మాట్లాడే హక్కు మీకు ఏం ఉంది?. డబ్బు ఉన్నవాళ్లు హైదరాబాద్ తరలివచ్చారు. లేనివాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు.” అంటూ హరీశ్‌ను ఎద్దేవా చేశారు.