డిప్యూటీ సీఎంకు సవాల్ విసిరిన హరీశ్‌రావు
తెలంగాణాలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్‌పై సభలో వాడీ వేడీగా చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. ఆయన మాట్లాడుతూ..కాసేపు అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ బ్రేక్ ఇస్తే తాను,భట్టి గన్ పార్క్ వద్ద నిలబడతామన్నారు. ఈ క్రమంలో అక్కడ వెళ్లే జనాన్ని మనం ఎవరి పాలనలో తెలంగాణాలో కరెంట్ బాగుందో అడుగుదామన్నారు.కాగా దీనికి సరైన సమాధానం వారే చెప్తారని హరీశ్‌రావు పేర్కొన్నారు.అయితే దీనికి మీరు సిద్ధమేనా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగం బీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందన్నారు. కాగా ఈ ప్రభుత్వం తెలంగాణా ప్రజలకు అబద్ధాలు చెబుతుందని హరీశ్‌రావు ఆరోపించారు.

