డిప్యూటీ సీఎం పవన్‌కు హరిరామ జోగయ్య లేఖ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా మీ పాలనలో అభివృద్ధి,సంక్షేమాన్ని సమపాలల్లో పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఏపీలోని కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నానన్నారు. ఏపీలోని కృష్ణాజిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని ఆయన కోరారు. టాలీవుడ్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ సగం రోజులు సినిమాలకు..సగం రోజులు పరిపాలనకు సమయం కేటాయించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా,మండల పరిషత్ పంచాయితీ వ్యవస్థలను బలోపేతం చేయాలని హరిరామ జోగయ్య ఈ లేఖలో వెల్లడించారు.

