Home Page SliderTelangana

ఎండకు ఉడికిన గుడ్డు

వేసవిలో కొందరు రోడ్లపై ఎండలో ఆమ్లెట్ వేయడం లాంటివి చూస్తుంటాం. కానీ, ఎండవేడికి ఏకంగా ఎగ్ ట్రేలో కోడిగుడ్డు ఉడికిన ఘటన ఉప్పల్ గణేశ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఉప్పల్ గణేశ్ నగర్‌లో చికెన్ దుకాణం నుంచి ఎగ్‌ట్రే స్థానిక ఓ మహిళ కొనుగోలు చేసింది. కోడిగుడ్డు ఆమ్లెట్ వేద్దామని చూడగా ఒక గుడ్డు ఉడికి ఉండడంతో షాక్ అయింది. ఎండ వేడికి ఏకంగా కోడి గుడ్డు ఉడికిందని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో ఎండ తీవ్రతకు ఈ ఘటన నిదర్శనంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.