చిరంజీవికి తమ్ముడు పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు
అన్నయ్య చిరంజీవికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తమ్ముడుగా పుట్టి అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఒక సన్నని వాగు అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లు ఆయన పయనం తనకు అలా గోచరిస్తుందని చెప్పారు. ఆయన ఎదిగి తాము ఎదగటానికి ఒక మార్గం చూపటమే కాక లక్షలాదిమందికి స్ఫూర్తిగా నిలిచిన సంకల్పం, పట్టుదల, శ్రమ నీతి నిజాయితీ సేవ భావం తన వంటి అందరికి ఆదర్శమన్నారు. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్న కొంచెం కూడా గర్వం ఆయనలో కనిపించకపోవటానికి ఆయన మలుచుకున్న తీరే కారణమన్నారు. ఆనందకరం ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో మీరు మరిన్ని విజయాలు చవి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.


