హ్యాపీ బర్త్‌డే “ది గోట్”
హీరో విజయ్ దళపతికి తమిళనాడులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన యాక్టింగ్‌తో తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. కాగా ఈ రోజు తమిళ దళపతి విజయ్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా విజయ్ హీరోగా నటిస్తోన్న చిత్రం “ది గోట్”( The Greatest Of All Time) నుంచి స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోలో డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్స్ సీన్స్‌ను మాత్రమే హైలెట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాలో విజయ్ డబుల్ యాక్షన్‌తో తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు.అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షుకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ హ్యాపీ బర్త్‌డే “ది గోట్” అని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం #TheGOATBDay ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

