Home Page SliderNational

హ్యాపీ బర్త్ డే “మిస్టర్ కూల్”

ఈ రోజు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇటీవల జరిగిన IPL మ్యాచ్‌లో ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ 5వ సారి కప్పును సొంతం చేసుకుంది. ఇవే కాకుండా ధోని టీమిండియా కెప్టెన్‌గా మూడు ICC ట్రోఫీలను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. క్రికెట్ చరిత్రలో ICC టోర్నమెంటులో 3 ట్రోఫీలను సొంతం చేసుకున్న ఒకే ఒక్కడుగా ధోని నిలిచాడు. కాగా 2011లో జరిగిన వరల్డ్ కప్‌లో కూడా ధోనీ సారథ్యంలో టీమిండియా వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. అయితే 2011లో జరిగిన ఈ WC ఫైనల్‌లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్‌ను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. కాగా అది ధోని కెరీర్‌లోనే గ్రేటెస్ట్ మూమెంట్‌గా చెప్పుకోవచ్చు. ఇవాళ ధోని పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ఆయన విన్నింగ్ షాట్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

అయితే ధోని కేవలం క్రికెట్ ద్వారానే కాకుండా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎంత ఎదిగినా..ఒదిగి ఉండాలనే దానికి ధోని నిదర్శనమనే చెప్పాలి. కాగా ధోని తన సింప్లిసిటీతో దేశవ్యాప్తంగా ఎన్నో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ధోని ఏం చేసినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. కాగా ధోని ఇటీవల ఫ్లైట్‌లో ప్రయాణించే క్రమంలో క్యాండీ క్రష్‌ను గేమ్‌ ఆడుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా క్యాండీ క్రష్ గేమ్‌కు డిమాండ్ పెరిగి లక్షల్లో ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒక్క సంఘటనతో ధోని మేనియా మన దేశంలో ఎంతలా ఉందో అర్థమవుతోంది. ఈ విధంగా ఎంతోమందిని తన ఆటతో, వ్యక్తిత్వంతో ప్రభావితం చేస్తున్న ధోని మరెన్నో పుట్టిన రోజులు జరుపుకుంటూ.. పదికాలాల పాటు చల్లాగా ఉండాలని ధోని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.