బండిసంజయ్‌కు ఊరట- బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేసిన హన్మకొండ కోర్టు
బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు, ఎంపీ బండిసంజయ్‌కు బెయిల్ రద్దు విషయంలో ఊరట లభించింది. పోలీసులు వేసిన బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తెలంగాణా పదోతరగతి మాల్ ప్రాక్టీస్ కేసులో ప్రధాన నిందితుడంటూ పోలీసులు అరెస్టు చేసి కేసు రిజిష్టర్ చేశారు. అయితే బెయిల్ లభించడంతో బండి సంజయ్‌ను విడిచిపెట్టారు. ఈ బెయిల్ రద్దు కోసం పోలీసులు హనుమకొండ కోర్టులో పిటిషన్ వేశారు. సంజయ్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ రోజు జరిగిన విచారణలో సంజయ్ తరపు న్యాయవాది రవిచందర్ వాదనల ప్రకారం బెయిల్ రద్దుకు సరైన కారణాలు లేవని కోర్టు అంగీకరించింది. దీనితో ఈ పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు.