హమాస్ కు చివరి ఛాన్స్… నెతన్యాహు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది హమాస్‌కు చివరి అవకాశం అని హెచ్చరిస్తూ, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హమాస్‌ను సమూలంగా నిర్మూలిస్తామని గట్టి హెచ్చరిక జారీ చేశారు.హమాస్ చెరలో ఉన్న బందీల కుటుంబాలను కలిసిన అనంతరం నెతన్యాహు మాట్లాడుతూ, మా ప్రజలను తిరిగి తీసుకురావడం మా ధ్యేయం. తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో వీరిని విడిపించేందుకు అవకాశమిస్తాం. కానీ ఇది హమాస్‌కు హానీమూన్ కాలం మాత్రమే. మోసం చేస్తే ఈసారి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయి అని చెప్పారు.60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల విడుదల,గాజా ప్రాంతంలో నిరాయుధీకరణ,హమాస్ సైనిక శక్తిని నిర్మూలన వంటి అంశాలు అంగీకరించబడ్డాయి.తాత్కాలిక విరమణ మా లక్ష్యాన్ని నిలిపివేయలేను. హమాస్ విషయంలో దౌత్య, సైనిక శక్తుల కలయికతో ముందుకు వెళ్తాం. దౌత్యం విఫలమైతే సైనిక శక్తి పని చేస్తుంది.ఇరాన్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలలో భాగంగా ఈ విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు నెతన్యాహు వెల్లడించారు.ఇజ్రాయెల్ యోధుల ధైర్యసాహసాలను ప్రస్తావిస్తూ ఉగ్రవాదంపై పోరాటంలో మేం ఎన్నో విజయాలు సాధించాం. హమాస్ సైనిక శక్తిని నిర్వీర్యం చేశాం. ఇజ్రాయెల్ భద్రత పునరుద్ధరించే వరకు మేం ఆగం అని స్పష్టం చేశారు.

