హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన భీభత్సం..
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా కురిసిన జల్లులు ఊరటనిచ్చాయి. ఒంటి గంట వరకు దంచి కొట్టిన వర్షం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఆకాశమంత మబ్బులతో కమ్ముకుంది. నగరంలోని మీర్‌పేట్, బాలాపూర్ పరిసరాల్లో భారీ వర్షంతో పాటు వడగళ్ళు వాన కురిసింది. వర్షం కారణంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.