Home Page SliderNational

H3N2 ఇన్ఫ్లుఎంజా రెండు మరణాలు, హర్యానా, కర్ణాటకలో ఒక్కోటి

హెచ్‌3ఎన్2 వైరస్ వల్ల ఇన్‌ఫ్లుఎంజాతో ఇద్దరు వ్యక్తులు మరణించారని ప్రభుత్వం తెలిపింది. హర్యానాలో ఒకరు, కర్ణాటకలో మరొకరు మరణించారంది. కర్ణాటకలోని హసన్‌లో 82 ఏళ్ల వృద్ధుడు దేశంలోనే హెచ్‌3ఎన్2తో మరణించిన మొదటి వ్యక్తిగా భావిస్తున్నారు. హిరే గౌడ ఫిబ్రవరి 24న ఆసుపత్రిలో చేరగా మార్చి 1న మరణించినట్లు అధికారులు తెలిపారు. అతను బీపీ, షుగర్‌తో బాధపడుతున్నాడు. దేశంలో ఇప్పటి వరకు దాదాపుగా 90 H3N2 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది H1N1 వైరస్ కేసులను కూడా గుర్తించాడు. గత కొన్ని నెలలుగా దేశంలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. “హాంకాంగ్ ఫ్లూ” అని కూడా పిలువబడే H3N2 వైరస్ వల్ల చాలా ఇన్ఫెక్షన్లు వస్తాయని… వైరస్ సాధారణ ఇన్ఫ్లుఎంజాలతో పోల్చుకుంటే… ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కలిగిస్తోందంటున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు H3N2, H1N1 ఇన్ఫెక్షన్లు మాత్రమే కనుగొనగా… తాజాగా మరణాలూ నమోదయ్యాయి.

మృతులు ఇద్దరూ కోవిడ్‌కు సమానమైన లక్షణాలు కలిగి ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా 68 లక్షల మంది మృతి చెందారు. మహమ్మారి రెండు సంవత్సరాల తర్వాత, పెరుగుతున్న ఫ్లూ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిరంతర దగ్గు, జ్వరం, చలి, ఊపిరి ఆడకపోవడం, శ్వాసలో గురక వంటి లక్షణాలు ఉంటాయి. రోగులు వికారం, గొంతు నొప్పి, శరీర నొప్పి, విరేచనాల సమస్యతోనూ బాధపడుతున్నారు. ఈ లక్షణాలు దాదాపు ఒక వారం పాటు కొనసాగుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వైరస్ అంటువ్యాధి… జబులు, దగ్గు సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ద్వారా వ్యాపిస్తుంది. చేతులు క్రమం తప్పకుండా కడుక్కోవడంతో పాటు,మాస్క్ ధరించాలి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తుమ్మినప్పుడు, దగ్గేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, ముక్కుల్లోంచి నీళ్లు కారుతున్నప్పుడు, జ్వరం, ఒళ్లు నొప్పులుంటే పారాసెటమాల్‌ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వైద్య సమస్యల కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులతో పాటు, పెద్దలు, చిన్న పిల్లల్లో వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫెక్షన్ బాక్టీరియా కాదా అని నిర్ధారించే ముందు రోగులకు యాంటీబయాటిక్స్ సూచించవద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వైద్యులను కోరింది. ఇలా వాడటం వల్ల భవిష్యత్‌లో వ్యాధిని తట్టుకోవడం ఇబ్బంది అవుతోందంది.