Home Page SliderTelangana

జిమ్ ట్రైనర్‌ను డంబుల్స్‌తో కొట్టి సంపిండ్రు..

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ వీరారెడ్డి నగర్‌లో జెస్ట్ ఫిట్ జిమ్ నిర్వాహకుడు, కోచ్ కిషోర్ (35)పై డంబుల్స్‌తో అతని నలుగురు స్నేహితులు దాడి చేశారు. కిషోర్ జిమ్ లో ఉండగా అతని స్నేహితుడు చంటి, మరో ముగ్గురు వ్యక్తులు డంబుల్స్‌తో దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలై పరిస్థితి విషమించడంతో, గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కిషోర్ మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలో కిషోర్‌పై చంటి తన ముగ్గురు స్నేహితులతో దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.