గుంటూరు- తిరుపతి రైల్లో దోపిడీ దొంగల బీభత్సం
తిరుపతి గుంటూరు రైల్లో కడప జిల్లా కమలా పురం- ఎర్రగుడిపాడు మధ్యలో దొంగలు బీభత్సం సృష్టించారు. రైలు ఎర్రగుడిపాడు స్టేషన్‌లో ఆగుతుండగానే ఎస్1 బోగి నుండి ఎస్ 6 బోగి వరకు ఒక్కసారిగా 25 మంది దొంగలు రైలు వద్దకు వచ్చి కిటికిల వద్ద కూర్చుని ఉన్న మహిళల మెడలో నుండి గొలుసులు తెంపుకు పోయారు. ప్రతిఘటించిన ప్రయాణికులపై రాళ్లు రువ్వి నగలు దోచుకుపోయారు. దోపిడి జరిగిన వెంటనే 139 అనే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసారు ప్రయాణికులు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. వీరు ట్రైన్ చైన్ లాగి ఆపినట్లు సమాచారం. గత సంవత్సరం కూడా ఇదే స్థలంలో ఇలాగే దొంగతనం జరిగిందంటున్నారు. అప్పటి కేసు కూడా ఇంతవరకూ ఏం తేలలేందంటున్నారు స్థానికులు.