నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న గుంటూరు కారం మూవీ
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన గుంటూరు కారం భారీ విజయాన్ని సాధిస్తోంది. సినిమా హాల్స్ లో మిక్స్‌డ్ రియాక్షన్ వచ్చినప్పటికీ… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో వీక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయం నమోదు చేసింది.

గ్లోబల్ టాప్ 10 జాబితాలో, గుంటూరు కారం 5.3 మిలియన్ గంటలు వీక్షించగా, 20 లక్షల వ్యూస్ సాధించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిందీ వెర్షన్ సైతం దుమ్మురేపుతోంది. గుంటూరు కారం హిందీ వెర్షన్ 2.8 మిలియన్ గంటలు వీక్షించబడి 1.1 మిలియన్ వీక్షణలతో 10వ స్థానంలో ఉంది.

గతంలో సినిమాలకు భిన్నంగా నార్త్ ఇండియాలో గణనీయమైన వ్యూయర్‌షిప్‌ను గుంటూరు కారం సాధించింది. పాన్-ఇండియాయేతర చిత్రాలు కూడా హిందీ వెర్షన్‌లలో OTT ప్లాట్‌ఫారమ్‌లలో విజయాన్ని సాధించడంతో తెలుగు చలనచిత్రాలకు క్రేజ్ పెరిగింది. హాయ్ నాన్నా తాజా ఉదాహరణ, ఇప్పుడు గుంటూరు కారం కూడా అదే విధంగా సక్సెస్ అవుతోంది.

గ్లోబల్ మూవీ కోసం మహేష్ బాబు, SS రాజమౌళి మధ్య రాబోయే మూవీ నేపథ్యంలో… OTTలో గుంటూరు కారం వైపు హిందీ ప్రేక్షకులను ఆకర్షితులైనట్టు సినీ వర్గాలు చెబతున్నాయి. అదే సమయంలో హిందీ డబ్బింగ్ కూడా చక్కగా కుదరడంతో వీక్షకులకు డబ్బింగ్ కాకుండా స్ట్రెయిట్ హిందీ సినిమా చూసిన అనుభూతి కలుగుతోంది.

