మంత్రి అంబటిపై కేసు నమోదు చేయాలన్న గుంటూరు కోర్టు
సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో టికెట్లను బలవంతంగా అంటగడుతూ వసూళ్లకు పాల్పడ్డారని జనసేన ఆరోపించింది. దీంతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వెంకటేశ్వరరావు పిటిషన్‌ను మంగళవారం విచారించిన కోర్టు.. మంత్రి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులను కోర్టు ఆదేశించింది.