Andhra PradeshHome Page Slider

గుంటూరు నగర మేయర్ రాజీనామా

గుంటూరు నగర మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. నగర కమిషనర్ తీరుకు నిరసనగా మనోహర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తునట్లు కావటి ప్రకటించారు. 2021లో గుంటూరు మేయర్ గా మనోహర్ నాయుడు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది ఉండగానే పదవికి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా నగర కమీషనర్, మేయర్ మధ్య వివాదం నెలకొంది. కూటమి నేతల నిందలు, అవమానాలు భరించలేక తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని కావటి పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను కలెక్టర్ కి పంపిస్తానని మీడియాకు చెప్పారు. మేయర్ పదవికే రాజీనామా చేశాను తప్పా.. ప్రజల పక్షంలో నిలబడే విషయంలో కాదని ఆయన అన్నారు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.