Andhra PradeshNews

రావులపాలెంలో కాల్పుల కలకలం

ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో గన్ ఫైర్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే ఘటనాస్థలంలో మూడు నాటు బాంబులను గుర్తించి..వాటిని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో దుండగులు వదిలి వెళ్లిన బ్యాగును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో జామర్‌తో పాటు మెడికల్ షాప్ కవర్‌ను కూడా  పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.