Home Page SliderTelangana

ప్రజలు బీజేపీ గెలుపు కోరుకుంటున్నారన్న గుల్బర్గా ఎంపీ ఉమేష్ జాదవ్

కుల్కచర్ల: ప్రజలు బీజేపీ గెలుపు కోరుకుంటున్నారని కర్ణాటక రాష్ట్ర గుల్బర్గా ఎంపీ ఉమేష్ జాదవ్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతీ కిరణ్‌కు మద్దతుగా ఆదివారం సాల్వీడ్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలోని హనుమాన్ టెంపుల్‌లో పూజలు చేశారు. అనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టి మాట్లాడారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేయాలని హామీ ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బీజేపీ అన్నారు. అందుకే బీజేపీ బీసీ అభ్యర్థి మారుతీ కిరణ్‌ను గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని గుల్బర్గా ఎంపీ ఉమేష్ జాదవ్ అన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభ్యర్థి మారుతీ కిరణ్‌తో కలిసి మాట్లాడారు. ప్రధాని అమలు చేసిన పథకాల వల్ల మంచి ఫలితాలే రాబోతున్నాయన్నారు.