గుజరాత్ మే ఔర్ ఏక్ బార్ బీజేపీ సర్కార్
మోదీపై గుజరాతీల తిరుగులేని విశ్వాసం
ఏడోసారి వరుసగా బీజేపీవైపు మొగ్గు
తాయిలాల కంటే బీజేపీ వైపు జనం చూపు
హిమాచల్ ప్రదేశ్‌లో ఆనవాయితీ తప్పుతుందా?
హిమకొండలపై వరుసగా రెండోసారి గట్టెక్కనున్న బీజేపీ
గట్టి పోటీ ఇచ్చిన హస్తం ఓటమి ఖాయమన్న సర్వేలు
గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీకి పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయ్. గుజరాత్‌ను బీజేపీ వరుసగా ఏడోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలు తేల్చాయి. న్యూస్ ఎక్స్ జనక్‌కీ బాత్ సర్వే ప్రకారం బీజేపీకి 117-140 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 34-51 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 6-13 సీట్లు మధ్య రానున్నాయ్. ఇక రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ చానెల్ అంచనా ప్రకారం బీజేపీకి 128-148 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 30-42, ఆప్‌కి 2-10 సీట్లు వస్తాయని తేలింది. ఇక టీవీ9 గుజరాతీ అంచనా ఇలా ఉంది. బీజేపీకి 125-130, కాంగ్రెస్ పార్టీకి 40-50, ఆప్‌కి 3-5 మధ్య వచ్చే అవకాశం ఉంది. టైమ్స్ నౌ ఈటీజీ అంచనా ప్రకారం బీజేపీకి 139, కాంగ్రెస్ పార్టీకి 30, ఆప్‌కి 11 స్థానాలు లభించవచ్చు. జీన్యూస్-బార్క్ అంచనా సైతం బీజేపీకి కచ్చితమైన విజయం లభిస్తోందని అంచనా వేసింది. బీజేపీకి 110-125, కాంగ్రెస్ పార్టీకి 45-60, ఆప్‌కి 1-5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. పోల్ ఆఫ్ పోల్స్ అంచ ప్రకారం గుజరాత్‌లో బీజేపీకి సుమారుగా 131 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

ఇక హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సునాయశంగా విజయం సాధిస్తోందని సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం బీజేపీ వైపు మొగ్గు చూపుతుందని అన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా టీవీ అంచనా మేరకు బీజేపీకి 35-40, కాంగ్రెస్ పార్టీకి 26-31 వస్తాయని తేలింది. న్యూస్ ఎక్స్ -జన్‌కీ బాత్ అంచనా ఇలా ఉంది. బీజేపీకి 32-40, కాంగ్రెస్ పార్టీకి 27-34 సీట్లు రావొచ్చు. ఇక రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ లెక్క ప్రకారం బీజేపీకి 34-39, కాంగ్రెస్ పార్టీకి 28-33 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఒక్క ఆజ్ తక్-యాక్సిస్ మై ఇండియా మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చింది. హస్తం పార్టీ 30-40 సీట్లు గెలిచే అవకాశం ఉండగా, బీజేపీ 24-34 సీట్లు మాత్రమే గెలవొచ్చనంది. విచిత్రమేమంటే హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ మరోసారి ఖాతా తెరిచే అవకాశం లేదని అన్ని సర్వేలు ముక్తకంఠంతో చెప్పాయి. టైమ్స్ నౌ ఈటీజీ అంచనా ప్రకారం బీజేపీకి 34-42, కాంగ్రెస్ పార్టీకి 24-32 వస్తాయంది. జీన్యూస్-బార్క్ అంచనా ప్రకారం బీజేపీకి 35-40, కాంగ్రెస్ పార్టీకి 20-25, ఆప్‌కి సున్నా నుంచి 3 సీట్లు రావొచ్చంది. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలకు గాను మెజార్టీ మార్క్ 35 కాగా.. బీజేపీ 37 స్థానాలు దక్కించుకోనుందని సర్వేలు అభిప్రాయపడుతున్నాయి.