గిన్నిస్ రికార్డుకెక్కిన అతి చిన్న కుక్కపిల్ల
అమెరికాకు చెందిన ఒక చిన్న కుక్కపిల్ల గిన్నిస్ రికార్డుకెక్కింది. చిన్నదంటే వయస్సులో కాదండోయ్, సైజులో. ప్రపంచంలోనే అతి చిన్న కుక్కపిల్లగా గతంలో ‘మిరాకిల్ మిల్లీ’ అనే కుక్కపిల్లపై ఉన్న రికార్డును 2020లో పుట్టిన ఈ ‘పెర్ల్’ అనే కుక్కపిల్ల బద్దలు కొట్టి రికార్డు సాధించింది. ఇది అతి చిన్న సైజులో టీవీ రిమోట్ కంటే చిన్నగా, డాలర్ నోటుకు సమానమైన సైజులో ఉంది. దీని ఎత్తు కేవలం 9.14 సెంటీమీటర్లు, అంటే 3.59 అంగుళాలు మాత్రమే. పొడవు 12.7 సెంటీమీటర్లు అంటే 5 అంగుళాలు మాత్రమే. అంటే ఇది కేవలం ఒక ఎలుక పిల్ల సైజులో ఉంటుంది.