InternationalNews Alert

80 ఏళ్ల వయస్సులో వృద్ధుల గిన్నిస్ రికార్డ్

వయస్సు శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించారు ఈ బామ్మలు, తాతయ్యలు. 80 ఏళ్ల వయస్సులో 8 మంది వృద్ధులు విమానం నుండి దూకి, స్కై డైవింగ్ చేసి ఏకంగా గిన్నిస్ రికార్డునే సాధించారు. ది జంపర్స్ ఓవర్ ఎయిటీ సొసైటీకి చెందిన 8 మంది సభ్యులు జిమ్ కుల్హనే, క్లిఫ్ డేవిస్, స్కాటీ గాలన్, వాల్ట్ గ్రీన్, పాల్ హినెన్, స్కై హుమిన్స్కీ, వుడీ మెక్కే, టెడ్ విలియమ్స్ వీరంతా విమానం నుండి దూకి ఒక వృత్తాకారంలో స్కైడైవింగ్ చేశారు. వారి సంస్థ హాల్ ఆఫ్ ఫేమ్ సెలబ్రేషన్ కోసం మూడు రోజుల ఈవెంట్‌లో భాగంగా వారు ఈ ఫీట్‌ను ప్రదర్శించారు. వారు కాలానుగుణంగా వారి బృందం అభివృద్ధి చెందుతోందని గర్వంగా తెలియజేస్తున్నారు. మామూలుగా 80 ఏళ్ల వయస్సులోని తాతలు, బామ్మలు ఎలా ఉంటారో మనకు తెలుసిందే. పాపం సరిగ్గా నడవడానికి కూడా ఇబ్బంది పడతారు.  కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి పనైనా సాధిస్తారని వారు నిరూపించారు.