తెలంగాణాలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ
తెలంగాణా ప్రభుత్వం రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణాలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2,00,000 రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. కాగా రాష్ట్రంలో 12 డిసెంబర్ 2018 నుండి 13 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని తెలిపింది. అయితే ఈ రైతు రుణమాఫీ కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసింది.