Andhra PradeshHome Page Slider

హైదరాబాద్‌లో జీఎస్టీ అధికారి కిడ్నాప్

హైదరాబాద్‌లోని దిల్‌షుక్ నగర్‌లోని కృష్ణానగర్‌లో  జీఎస్టీ అధికారిని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది.    మణిశర్మ అనే జీఎస్టీ సీనియర్ అధికారి జీఎస్టీ కట్టని ఓ షాప్‌ను సీజ్ చేసేందుకు మరో అధికారి ఆనంద్‌తో కలిసి వెళ్లారు. దీనితో ఆ షాప్ ఓనర్ మరో ముగ్గురితో కలిసి వారిపై దాడి చేసి, కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సెల్‌ఫోన్, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని పట్టుకుని అరెస్టు చేశారు. అయితే కిడ్నాపర్లు వాడిన కారుపై టీడీపీ నేత ముజీబ్ పేరుతో స్టిక్కర్ ఉండడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ముజీబ్ గుంటూరుకు చెందిన టీడీపీ నేత. వారి అనుచరులే ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.