తెలంగాణాలో వాయిదా పడనున్న గ్రూప్-2 ఎగ్జామ్
తెలంగాణా రాష్ట్రంలో జూలైలో డీఎస్సీ,ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి.ఈ మేరకు వీటికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్‌ను తెలంగాణా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వెనువెంటనే రెండు ఎగ్జామ్‌లు ఉండడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఆగస్టులో నిర్వహించబోయే గ్రూప-2 పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి నేడు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం కన్పిస్తోంది. కాగా తెలంగాణాలో ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సీ ఎగ్జామ్ జరగనుంది. అనంతరం రెండు రోజుల గ్యాప్‌తో ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలకు షెడ్యూల్ విడుదల అయ్యింది.


 
							 
							