Home Page SliderTelangana

గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయలేం: హైకోర్టు

ఇటీవల కాలంలో తెలంగాణాలో జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో TSPSC నిర్వహించిన దాదాపు 7 రకాల పోటీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే తెలంగాణాలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను TSPSC  రద్దు చేసింది. అయితే రద్దు చేసిన అన్ని పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామని TSPSC ప్రకటించింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 11న నిర్వహిస్తామని TSPSC అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే తెలంగాణాలో  మరో రెండు రోజుల్లో జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు సంబంధించి దాఖలైన పిటిషన్లను ఇటీవల సింగిల్ జడ్జ్ కొట్టివేశారు. కాగా ఈ ఉత్తర్వులను ఓ వ్యక్తి ధర్మాసనం వద్ద సవాలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం ప్రిలిమ్స్ జరగకుండా నిలిపివేయడం పరిష్కారం కాదని అంతిమ తీర్పును వెలువరించింది.