Andhra PradeshNews

విశాఖలో మురికివాడలకి గ్రీన్‌మ్యాట్ ముసుగు

విశాఖలో హైవే పక్కన ఉన్న మురికి వాడలకు అడ్డంగా గ్రీన్‌మ్యాట్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. విశాఖలో జీ-20 సదస్సు జరుగనునన్న నేపథ్యంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. విదేశాల నుండి ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రముఖులు వస్తూడడంతో వారికి ఈ మురికి వాడలు కనపడకుండా వాటి చుట్టూ తెరలు ఏర్పాటు చేశారు. దీనిపై అక్కడి ప్రజలు అసహనం ప్రదర్శిస్తున్నారు. తమ ఇబ్బందులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తాము ఎండకు ఎండి, వానలకు తడిసి అవస్థలు పడుతున్నామని, తమకు పక్కా ఇళ్లు మంజూరైనా వాటిని ఇంకా అందజేయలేదని పేర్కొన్నారు. విదేశీయులకు విశాఖను అందమైన నగరంగా చూపించే ప్రయత్నంలో తమలాంటి పేదవారి గోడును పెడచెవిన పెడుతున్నారని వాపోతున్నారు.